Categories
పెద్ద పెద్ద ఇయర్ రింగ్స్ భారీగా వుండే కర్ణాభరణాల కారణంగా ఒక్క సారి చెవి రంద్రాలు పెద్దవై పోతాయి అందుకే వీటిని ప్రత్యేక సందర్భాలకు పరిమితి చేయాలి. ఒక వేళ ఇప్పటికే చెవి తమ్మెలు జారినట్లు అనిపిస్తే డేర్మాటో సర్జన్ చెవి తమ్మెల్ని కుట్టు వేయడం లేదా సాగిన చెవి భాగానికి స్కిన్ గ్లూ వేయడం వంటివి చేస్తారు. సర్జన్ వేరే రంధ్రం చేసి తిరిగి చెవి పోగులు సరిగా పెట్టుకోగాలిగేలా సారి చేస్తారు. అందుకే ఇంతవరకు రాకుండా పల్చగా వుండే చెవి తమ్మెలు జారి పోకుండా మరీ బరువుగా వేలాడే భారీ ఇయర్ రింగ్స్ పెట్టుకోవద్దు.