ఎపుడూ బరువు తగ్గే విషయంలో అంతులేనన్ని అధ్యాయినాలు రిపోర్ట్ లు వస్తుంటాయి. ఇప్పుడు తాజాగా బరువు పెరగాలనుకునే వారి గురించి ఒక మంచి అధ్యాయినం వచ్చింది. కొంత మంది ఎప్పుడూ చాలా సన్నగా ఓపిక లేనట్లు ఉంటారు. బరువు పెరగాలి అనుకుంటారు. అయితే వాళ్ళు తినే పదార్ధాలు ఎంపిక చేసుకోవాలి. బరువు పెరగాలి అంటే ప్రొటీన్లు, కార్బోహైడ్రేట్లు పుష్కలంగా తీసుకోవాలి. పండ్లు, నట్స్, బీన్స్, అనేక కురగాయాల్లో మంసాల్లో ఇవి లభిస్తాయి. తగినంత ఒమేగా-3 ఫ్యాటీ ఆసిడ్స్ అవసరం. చేపలు, అవిసెగింజలు చాలా మంచివి. తప్పకుండా తినాలి కుడా. కాల్షియం కావాలి. అంటే ఓ అరలీటర్ పాలు లేదా రెండు కప్పుల పెరుగు తీసుకోవాలి. క్యాలరీల మోతాదు ఎక్కువ వుంటే బరువు పెరగడం సాధ్యం అవుతుంది. ఆహారం తీసుకుంటేనే శరీరం పుష్టిగా ఆరోగ్యవంతంగా తయ్యారవ్వుటుంది. ఈ తీసుకునే ఆహారం వల్ల చర్మం మెరుపు వస్తుంది. వార్దక్య భయాలు కుడా దూరంగా పోతాయి.

Leave a comment