ఒక అధ్యయనం ప్రకారం కార్బోహైడ్రాట్స్ తక్కువగా ఉన్న ఆహారం ఆరు నెలల పాటు తీసుకోగలిగితే బరువు గ్యారెంటీ గా తగ్గిపోతారు. తక్కువ ఫ్యాట్ ఉన్న ఫుడ్ కన్నా లో కార్బోహైడ్రాట్స్ ఉన్న ఆహారం తినటం వల్ల శరీరానికి మేలు జరుగుతుంది బరువు తగ్గిపోవటం ఖాయం. లో ఫ్యాట్ డైట్ వల్ల ఆరోగ్యానికి అపకారమే జరుగుతుందంటున్నారు. ప్రాసెస్డ్ ఫుడ్ మంచిది కాదు కాబట్టి వాటికి దూరంగా వుండాల్సిందే. అలాగే కార్బోహైడ్రాట్స్ తగ్గిస్తునామ్ము కదా అని మాంసాహారం ఎక్కువగా తీసుకోవటం కూడా కష్టమే. కార్బోహైడ్రాట్స్ లో కూడా 46 శాతం క్యాలరీలు ఉంటాయి అయినా కొవ్వు కరిగించే విషయంలో కార్బోహైడ్రాట్ వల్లనే ఎక్కువ ప్రయోజనం ఉంటుందంటున్నారు అధ్యయనాలు. ఎలాంటి ప్రాసెస్డ్ ఫుడ్ తీసుకోకుండా కేవలం లో కార్బోహైడ్రాట్ తీసుకుంటే జీవన శైలిలో మార్పులు అంటే ఉదయాన్నే వాకింగ్ కొద్దిపాటి వ్యాయామం చేస్తే ఆరు నెలలు ఒక కిలో నుంచి నాలుగు కిలోలు బరువు తగ్గిపోతారు అంటూ చెపుతున్నారు పరిశోధకులు.
Categories