Categories
ఇంట్లో పనులు చేసే విషయంలో జరిగే కొద్ది పాటి అశ్రద్దలే ఆర్థరైటిస్ కు దారి తీస్తాయని బ్రిటన్ పరిశోధకులు చెప్తున్నారు. ఎక్కువ బరువు ఎత్తడం,ఆ ఎత్తే సమయం లో నిటారుగా ఉండటంతో, చేతులపై పడే భారం మోకాలికి పాకి, లోపలి కీలు ఎముకలు కిందికి జారిపడటం ఇందుకు కారణమని పరిశోదనలు చెపుతున్నాయి. అలాగే అధిక బరువు కూడా మోకాళ్ళ నొప్పికి కారణం. కదలికలకు అనుగుణంగా మోకాళ్ళు వంగుతాయి. అధిక భారువు, వత్తిడి ఎక్కువైనప్పుడు వస్తాయి. అలాగే అధికమైన వ్యాయామాలు,బరువులెత్తే వ్యాయామాలు వల్ల కూడా మోకాళ్ళు నొప్పి పెడతాయి. అలాగే ఎత్తు మడిమల చెప్పుల వల్ల కూడా ఆస్ట్రియో పోరాసిన్ రావచ్చంటున్నాయి అధ్యయనాలు. అలాగే నిద్ర తగ్గితే కూడా నొప్పులు ఎక్కువ అవతాయంటున్నారు.