Categories
వర్షంలో తడవటం లేదా ఎక్కువ సమయం నీళ్లలో ఉండవలసి వస్తే పాదాల పైన తేమ అధికమై ఇన్ఫెక్షన్ లు వస్తాయి.ఈ సీజన్ లో మరీ ఎక్కువ వర్షంలో బయటికి వెళ్ళవలసి వస్తే ఓపెన్ ప్లాస్టిక్ చెప్పులు లేదా రబ్బరు చెప్పులు వేసుకోవాలి. స్నానం చేసినప్పుడు కాళ్లు కడుకున్నప్పుడు పాదాలు తడి లేకుండా తుడుచుకోవాలి.పాదాలపైన యాంటీ ఫంగల్ డస్టింగ్ పౌడర్ టాల్కమ్ పౌడర్ చల్లుకోవాలి మాయిశ్చరైజర్ వాడకం తగ్గించాలి. ఉతికిన దుస్తులు వేడి నీళ్లలో ముంచి తీసి ఆరబెట్టుకోవాలి ఫంగస్ వ్యాపించకుండా జాగ్రత్త పడాలి.