గ్రంధాలయం పేరులోనే ఒక ఆలయం ఉంది . పుస్తకాలంటే పవిత్రమైన మందిరం అని అదే గ్రంధాలయం . అందమైన అందమైన రాజభవనం లాగా ఉంటే ప్రతిరోజు వెళ్లిచూడాలి అనిపించేంత అందంగా ఉంటే అలాంటిది ఉంది చెక్ రిపబ్లిక్ లోని ప్రాగ్ నగరంలో ఉన్న క్లెమెంటియం  గ్రంధాలయం . ఆ భవనం ఎంత అందమైన దంటే ,గోడల నిండా గ్రీకుకదల ఆధారంగా బోలెడన్ని పెయింటిగ్స్ గీసి ఉంటాయి . ఆ  పెయింటిగ్స్ నే ప్రెస్కో  పెయింటిగ్స్అంటారు . వందల ఏళ్ళ నాటి చారిత్రక పుస్తకాలు గ్రంధాలు అక్కడ భద్ర పరిచారు . జీ సూట్ బరోఖ్  నిర్మాణశైలి లో నిర్మించిన ఈ భవన సముదాయం విస్తీర్ణం దాదాపు ఐదు ఎకరాలు కొంతకాలం క్రితం జరిగిన ఆన్ లైన్ పోటీల్లో ప్రపంచంలోనే అందమైన గ్రంధాలయంగా మొదటి స్థానంలో నిలిచిందీ క్లెమెంటియా

Leave a comment