ముఖానికి రాసుకునే బ్యూటీ ప్రొడక్ట్స్ చర్మం త్వరగా గ్రహించేందుకు ఐస్ క్యూబ్స్ ఎంతగానో ఉపయోగపడతాయి. క్రీమ్ లేదా సీరమ్  వాడిన తర్వాత ముఖాన్ని ఐస్ క్యూబ్స్ తో రుద్దితే చర్మం మెరుస్తుంది. ఐస్ క్యూబ్ వస్త్రంలో చుట్టి దానితో ముఖం పైన ఉన్న నల్లని వలయాలు మీద సున్నితంగా రుద్దితే ఫలితముంటుంది. మేకప్ వేసుకొనే ముందు ఐస్ క్యూబ్ లేదా ఫాక్స్ వాడితే మేకప్ ఎక్కువ సేపు ఉంటుంది. పొడిబారి పగుళ్లు వచ్చి నా పెదవుల పైన ఐస్ క్యూబ్స్ తో సున్నితంగా రుద్దితే పగుళ్ళు పోతాయి. మిల్క్ ఐస్ క్యూబ్స్ ని చర్మం పైన రాసుకుంటే మృతకణాలు పోతాయి. పొడి వస్త్రం లో ఐస్ క్యూబ్స్ వేసి ముఖం పై మసాజ్ చేస్తే చర్మం పై ఉండే ముడతలు పోతాయి స్వేద రంధ్రాలు శుభ్రపడి చర్మం మృదువుగా తయారవుతుంది.

Leave a comment