Categories
షర్మిలా నాయర్ ఫ్యాషన్ డిజైనర్ . మహిళల పై వివక్షని ,భారీషిమింగ్ ,స్కిన్ కలర్ నెలసరి చుట్టూ అల్లుకున్న అపోహలు ,మహిళల కోసం పరిశుభ్రమైన టాయిలెట్ కోసం ఒక క్యాంపెయిన్ నిర్వహించారు . ఇందుకు గాను 18 మంది మహిళల అభిప్రాయాలు తీసుకొన్నారు . వారంతా షర్మిల డిజైన్ చేసిన నలుపు రంగు చీరెలు కట్టుకొని మహిళా వివక్ష పై గళం విప్పారు . తాము జీవితంలో ఎదుర్కొన్న రకరకాల వివక్షలపై గళం విప్పారు . తల్లి కావటం అనేది మహిళలకు ఛాయిస్ మాత్రమే అంతే గానీ తల్లి అయితేనే మహిళ కాదు అన్నారు రచయిత రెమ్య సనీంద్రన్ . ఇలాటి అనేక విషయాలు ఈ 18 మంది ఎక్స్ పర్డ్స్ ధైర్యంగా గళం విప్పారు . నలుపు ఒక రంగేనని అది నిరసనను బలంగా వ్యక్తం చేస్తుంది అంటారు షర్మిలా నాయర్.