Categories
చీరె కంటే అందమైన డ్రెస్ ఇంకొకటి లేదు. కానీ చీరెకు మంచి డిజైనర్ బ్లౌజ్ చేరిస్తేనే అందం రెట్టింపు అవుతుంది. చాలా ఖరీదైన డిజైనర్ బ్లౌజ్ లు రెడీ మేడ్ గా సరైన కొలతలతో ఆర్డర్ చేస్తే వచ్చేస్తున్నాయి. డిజైనర్ బ్లౌజ్ లో అతి సాదా చీరె కు కూడా రిచ్ లుక్ తీసుకొస్తాయి. ఇప్పుడు మంచి సిల్క్, జార్జెట్ సాదా చీరెలు డిజైనర్ బ్లౌజ్ లు ఫ్యాషన్.ఒకప్పుడు చీరె అంచుకు వాడిన క్లాత్ నే బ్లౌజ్ కు కూడా ఇచ్చేవారు. ఒకరకంగా మళ్లీ ఈ ఫ్యాషన్ కూడా తిరిగి వచ్చింది. సాదా పట్టు,జార్జెట్ వంటి ఖరీదైన చీరెలు డిజైన్ చేసిన బ్లౌజ్ తో మ్యాచ్ చేస్తే మొత్తం లుక్ మారిపోతుంది.