ఇండియన్ స్నాక్స్ సిరీస్ పేరుతో స్నాక్ మేకప్ ఫోటోలు ఇన్ స్టాగ్రామ్ లో పోస్ట్ చేస్తుంది దుబాయ్ కు చెందిన మేకప్ ఆర్టిస్ట్ దివ్య ప్రేమ్ చంద్.ఈ బ్యూటీ బ్లాగర్ పోస్ట్ చేసిన ఫోటో లకు ఎంతో ఆదరణ ఉంది. తల్లిదండ్రులు దుబాయిలో స్థిరపడినా దివ్య కు భారత్ అంటే ఎంతో ప్రేమ.ఈ ఇండియాలో దొరికే కురుకురే, మ్యాగి వంటివి మా బంధువులు దుబాయ్ వచ్చినప్పుడల్లా తెచ్చేవాళ్ళు ఈ స్నాక్స్ మేకప్ తో నాబాల్యపు రోజులను గుర్తు తెచ్చుకోవాలి అనుకున్నాను అందుకే ఇండియన్ స్నాక్స్ వాటి ప్యాకింగ్ కు మ్యాచ్ అయ్యే ఆభరణాలు కొంటాను ఆహారపదార్థాలు గుర్తుకు తెచ్చేలా మేకప్ వేసుకుంటాను. ఇది కాస్త కష్టమే అయినా ప్రాక్టీస్ చేశాను అంటోంది దివ్య ప్రేమ్ చంద్. మ్యాగి కురుకురే లు బ్రిటానియా  ఫిఫ్టీ ఫిఫ్టీ లను గుర్తుకు తెచ్చే ఆమె మేకప్ కు ఎంతో మంది అభిమానులు ఉన్నారు.

Leave a comment