ఈ ప్రపంచంలో అంతులేని వింతలున్నాయి వాటిని చూసి ఆశ్చర్యంలో నోరు తెరవటం తప్ప అవి ఎందుకలా వున్నాయో ఎవరు వాటిని క్రియేటివ్ చేశారో తెలుసుకొన్న వాళ్ళులేరు. ప్రపంచం నిండా ఎన్నో గుహలున్నాయి . ఒక్క గుహ కో కథ వుంది కొన్ని అందమైనవి కొన్ని కళాత్మకం,ఆశ్చర్యాన్ని ఇచ్చేవి,ఉన్నాయి. ఇటలీలో ఉన్న బ్లూ గ్రొట్టొ గుహ మాత్రం ఒక వింత . ఈ గుహ సగం సముద్రంలో మునిగి ఉంటుంది సముద్రపు నీటి పై పడి పరివర్తనం చెందిన కాంతి కిరణాలు ఈ గుహను నీలిరంగు మెరుపులతో నింపేయి . ప్రాచీన రోమన్లు ఈ నీలికాంతిని అర్ధం చేసుకోలేక దేవతల విగ్రహాలు స్థాపించి పూజించారు. దీన్ని దయ్యాల గుహ అని భయపడే వాళ్ళలు . తర్వత పరిశోధికులు ఈ నీలికాంతుల రహస్యం కనిపెట్టారు. ఈ అందమైన గుహను చేసేందుకు రెండు కళ్ళు సరిపోవు అంటారు టూరిస్ట్ లు.

Leave a comment