ఎవరి హద్దులో వారు ఉండటం మంచిది అన్నమాట వింటూ ఉంటాం. మనుష్యుల మధ్య హద్దులేమిటి అంటే మనిషి అంగీకరించిన అంగీకరించక పోయినా ప్రతి మనిషి చుట్టూ ఒక సరిహద్దు రేఖ ఉంటుంది. అంటే వ్యక్తిగత సమయం వ్యక్తిగత ఆలోచనలు,ఆశలు,భద్రమైన సౌకర్యవంతమైన జీవిత కాంక్ష వీటిలోకి ఇతరులు తొంగి చూడాలని అనుకోకపోవటమే ఒక హద్దు అనుకోవచ్చు. కనిపించని ఈ కంచె చాలా దృఢమైనది పసితనం నుంచే నాదీ నేను నా ఇష్టం,నా అభిప్రాయం అన్నవి ప్రకటించటం అలవాటై పోతూ ఉంటుంది. వ్యక్తిగత జీవితాన్ని అద్భుతంగా కాపాడుకోవాలని చూస్తారు. స్నేహితులకు బంధువులకు ఆత్మీయులకు ఒక గీత వరకు చనువు ఇస్తారు. దాన్ని దాటి ఎవరు ఒక్క అడుగు ముందుకు వచ్చినా ప్రైవసీ పోయినట్లే కదా. అందుకే నీ హద్దు అంతవరకే.. దాన్ని దాటకు అన్న మాట స్పష్టంగా చేపకపోయినా అది కనిపిస్తూనే ఉంటుంది. ఎవరైనా సరే ఈ హద్దులు దాటకుండానే బాంధవ్యాలను కాపాడుకోవటం చాలా అవసరం.

చేబ్రోలు శ్యామసుందర్
9849524134

Leave a comment