Categories
తెల్ల బియ్యం అన్నం కంటే కాస్త రుచి తక్కువగా ఉన్న బ్రౌన్ రైస్ తినండి. ఆరోగ్యానికి చాలా మంచిది అంటున్నారు ఎక్స్ పర్ట్స్. అయితే బ్రౌన్ రైస్ వండే ముందర ఒక అరగంట నానబెట్టాలి. కుక్కర్ లో వండటం మంచిది. తెల్లని బియ్యం అంత రుచిగా ఉండదు కనుక వండే ముందర నీళ్ళు మరగనిచ్చి అందులో కాస్త ఉప్పు వేసి తరువాత నానబెట్టిన బ్రౌన్ రైస్ వేసి ఐదు నిమిషాల పెద్ద మంట పైన ఉడికించి తర్వాత చిన్న మంట పైన నెమ్మదిగా ఉడికించాలి. ఈ అన్నాన్ని పదేపదే గరిటతో కలిపితే ముద్దలాగా అయిపోతుంది. కుక్కర్ లో వండితే ఐదారు విజిల్స్ వచ్చే దాకా ఉంచితే చక్కగా ఉడుకుతోంది. ఈ అన్నంతో బిర్యాని పులిహోర ఫ్రైడ్ రైస్ ఏవైనా వండుకొవచ్చు.