Categories
కొన్ని వేడుకల్లో గెస్ట్ గా పాల్గొనవలసి వచ్చినప్పుడు మేకప్ కాస్త భిన్నంగా ఉండాలి. మేకప్ కు ముందు మాయిశ్చరైజర్ సన్ స్క్రీన్ అప్లయ్ చేసుకోవాలి. వేడుకల్లో లైట్ల వెలుగు కు చర్మం కమిలిపోకుండా ఉంటుంది. అలాగే ఫ్లాష్ ఫోటోలో ముఖం అవసరానికి మించి వెలుగు కనిపించకుండా మ్యాట్ సాఫ్ట్ గ్లోయీ రకాలకు చెందిన ఫౌండేషన్ కలిపి అప్లై చేసుకుని తర్వాత లూజ్ పౌడర్ అద్దుకోవాలి. పగటి వేడుకలకు న్యాచులర్ లేదా రోజీ బ్లష్ ఎంచుకోవాలి పేస్టెల్, సాఫ్ట్ మెటాలిక్ ఐ షాడోలనే ఎంచుకుంటే కళ్ళు చక్కగా ఫోకస్ అవుతాయి. ఎరుపు, ప్లమ్, మెరూన్ మొదలైన రంగు లిప్స్టిక్ కలర్స్ ఐ షాడో కు మ్యాచ్ అయ్యే రంగుల్లో ఎంచుకోవాలి.