నీహారికా,

మానవ సంబంధాల్లో డబ్బు పాత్ర ఎంతో చిత్రమైంది. సంబంధాలు విడదీసేదీ, కలిపేదీ డబ్బే అందుకే అయినవాళ్ళ మధ్య, స్నేహితుల మధ్య డబ్బుకు సంబంధించిన ఇచ్చిపుచ్చుకోవడాల్లో చాలా జాగ్రత్తగా ఉండాలి. మనం స్నేహితులతో కలిసి ఏ హోటలుకో, సినిమాకో వెళతాం.ఖర్చు ఎవరు పెట్టుకోవాలి. ఈ స్నేహాలు కలకాలం ఉండాలంటే ఖర్చు షేర్ చేసుకోవడం ముందు నుంచి మొదలు పెట్టాలి. ఎవరో ఒకరు మొత్తం ఖర్చు పెట్టేలా చూసి, ఆ ఖర్చును అణాపైసలతో సహా లెక్క వేసి ఇచ్చేసే ఏర్పాటు చేసుకోవాలి. అలాగే కలిసి కుటుంబ ప్రయాణాలు, యాత్రలు, పెళ్ళిళ్ళు ఇవీ అంతే ఖర్చు విషయంలో ఒక ఒప్పందానికి ముందే రావాలి. మొత్తం అయ్యే ఖర్చు అందరూ ప్రతి పైసాతో షేర్ చేసుకోవాలి. అలాగే ఎవరికైనా బహుమతులు ఇవ్వాలన్నా సరే అందరూ కలిసి ఏదైనా ఉపయోగపడే వస్తువు కొని ఆ డబ్బు అందరూ కలిసి పంచుకోవాలి. ఇది చిన్న అంశం కాదు. భవిష్యత్తులో స్నేహం, బంధుత్వంపైన ప్రభావం చూపే అంశం. మనం కలిసి ఉండేందుకు ఎలాంటి ఏర్పాట్లు చాలా ముఖ్యం. ఏమంటావు?

Leave a comment