అమెరికా కు చెందిన ఇరవై ఒక్క ఏళ్ల లెక్సీ ఆల్‌ఫోర్డ్‌ 196 దేశాలు ప్రయాణాలు చేసి ఇటీవలే రిపబ్లిక్ ఆఫ్ కోసోవో లో అడుగుపెట్టి ఘనత సాధించింది. ఈ యువ ట్రావెలర్ లెక్సీ ఆల్‌ఫోర్డ్‌ కాలిఫోర్నియా లో జన్మించింది. ఈమె తల్లిదండ్రులకు ట్రావెల్ ఏజెన్సీ ఉంది. 18 ఏళ్లకే డిగ్రీ పట్టా తీసుకుని అప్పటికే 35 పైగా దేశాలు చుట్టేసింది లెక్సీ. 2019 లో ఉత్తర కొరియా పర్యటన పూర్తి చేసుకుని 196 దేశాలు చుట్టిన పిన్న వయస్కురాలు గిన్నిస్ బుక్ రికార్డుల్లోకి ఎక్కింది. పక్కా ప్రణాళిక తో ప్రపంచ దేశాలు చుట్టేస్తూ తన ఇన్‌స్టా పేజీ, ‘లెక్సీ లిమిట్ లెస్’ లో అప్ లోడ్ చేసింది.

Leave a comment