ముగ్గు గీసుకునే చిన్న చాక్ పీస్ ముక్కని వంటింల్లో ఉంచుకోండి ఎన్నో సమస్యలకు ఇది పరిష్కారం అంటారు ఎక్సపర్ట్స్. ఇప్పుడు వర్షాలకు ఇల్లంతా తేమగా ఉంటుంది, వంట గిన్నెలు,వెండి పాత్రలు మెరుపు తగ్గుతు వుంటాయి ఆలా నల్లగా మారిపోకుండా వాటిలో కొన్ని చాక్ పీస్ ముక్కలు వేసి పెట్టచ్చు . అవి తేమను పీల్చేస్తాయి. అలాగే లేత రంగుల దుస్తుల పైన సాస్ మరకలు, కూర మరకలు పడితే ఆ మారకాలపైనా చాక్ పీస్ తో రుద్ది పది నిముషాలు తర్వాత దుస్తుల్ని ఉతికి ఆరేస్తే మరకలు కనిపించవు. అలాగే వర్డ్ రోబ్స్ తేమకు ముక్క వాసన వస్తుంది. సువాసన కోసం ఫర్ ఫ్యూమ్స్ ఫ్రెషనర్లు కాకుండ రెండు చాక్ పీస్ ముక్కల్ని ఉంచితే సరిపోతుంది. వైట్ షర్టులు ,పిల్లల యూనిఫామ్స్ కలర్ లు చేతుల్లో మురికి తేలిగ్గా వదలాలంటే ఉతికే ముందు చాక్ పీస్ తో తెల్లని షార్ట్ కలర్ లు,చేతులపైనా రుద్ది తర్వత ఉతికేస్తే మురికి పోతుంది.