ఈ ఏడాది ఫ్యాషన్ వస్త్రశ్రేణి రంగులు తెలుపు ఎరుపు , లేత గులాబీ ఉదా అన్నారు ఎక్స్ పర్ట్స్. డార్క్ డెనిమ్ ఫ్యాబ్రిక్ కూడా మొదట వరుసలో ఉంది. ఈ డార్క్ డెనిమ్ క్రాప్ టాప్ గా ఎంచుకుంటే దానిపై ఎంబ్రాయిడరీ ఉంటే మరింత బావుంటుంది. పొడవాటి స్కర్టులు , పలాజోలు ఎంపిక చేసుకున్నా సరే ఎఎంబ్రాయిడరీ డెనిమ్ టాప్ చక్కగా ఉంటుంది. అలాగే నలుపు తెలుపు పాల్కొ డాట్స్ కూడా చాలా ఆకర్షణీయంగా ఉన్నాయి. నలుపు తెలుపు చుక్కల లాంగ్ గౌన్ సాయంత్రపు పార్టీ కి బావుంటుంది. సిల్క్ , షిఫాన్ అయినా పరికిణీ బ్లౌజ్ ఎంపిక చేసుకున్నా చుడీదార్ల కైనా ఈ పాల్కొ డాట్స్ బ్రహ్మాండమైన ఎంపిక. కొత్తగా కనిపించాలి అన్నా ఈ పాత మోడల్ బాగానే ఉంటుంది.

Leave a comment