Categories
వ్యాయామం అలవాటై పోయిన ఒక్క పూట మానేసినా ఎదో వెలితిగా ఉంటుంది. మరి వణికించే ఈ చలి రోజుల్లో వర్కవుట్స్ చేయటం వల్ల లాభం కంటే నష్టమే ఎక్కువ. చలికి నొప్పులొస్తాయి. చలిగాలులకు శరీరం ప్రభావితం కాకుండా నిండుగా చెమట పట్టే దళసరి వస్త్రాలు ధరించాలి. నేరుగా చలిలోకి పరుగు తీయకుండా ఇంట్లో వార్మ్ అప్ చేయాలి. అప్పుడు శరీరం వ్యాయామం కోసం సిద్ధం అవుతుంది.ఎండ తీవ్రత లేకపోయినా సన్ స్క్రీన్ రాసుకుని తీరాలి. లేకపోతే చర్మం చలికి పగిలి పాడవుతుంది. ఉదయాన్నే కాకపోతే సాయంత్రం కాస్త ఎండా వుండగానే వ్యాయామం పూర్తి చేసినా మేలే. ఎంతయినా చల్లని ఆహ్లాదకరమైన వాతావరణం కొన్ని జాగ్రత్తలు తీసుకుని జాగింగ్ మానక పోవటమే హాయి.