కోన్ ఐస్ క్రీమ్  తినేసాక చివరగా కోన్  కూడా బిస్కెట్ ఫ్లేవర్ తో తినేందుకు అనువుగా ఉంటుంది. ఇప్పుడు అచ్ఛంగా అలంటి వడ్డించే గిన్నెలొస్తున్నాయి. సూప్ లు, పాలు, పాయసం, తాగాక కప్పుల్ని కూడా అలాగే తినేయచ్చు. చివరికి కేక్ ముక్కని కూడా నేరుగా గిన్నెతో కలిపి తినేయచ్చు. అదెలాగంటే కుల్ఫీలు ,చాక్లేట్లు ,గోధుమ ,జొన్న ,రాగి , చీజ్ , మాంసం , కూడా గిన్నెల్లాగా  చేసే మిషన్లోచ్చాయి. వాఫిల్ బౌల్ మేకర్ దానిపేరు. మనక్కావలిసిన రకం పిండి నాన్ వెజ్ ,స్వీట్ ,ఏదైనా టేస్టీ గా  కలిపేసి ఇందులో ఆ పిండి పెట్టేసి మూత వేసేసి స్విచ్ నొక్కితే వెంటనే కాస్త పిండి పెడితే ఆ పిండి కాస్తా  గిన్నె ఆకారం లోకో  కోన్ ఆకారం లోకో కూడా మనం ఆర్డర్ ఇచ్చి తెచ్చుకున్న రకం రూపంలోకో మారిపోయి వచ్చేస్తాయి. ఇక చాక్లేట్  గిన్నెలకున్న పాపులారిటీ ఇంకా వేటికీ లేదుట. కరిగిన చాక్లేట్  ని వేరే అచ్చుల్లో  పూసి కూడా ఈ గిన్నెల్ని తయారు చేయచ్చు. కూరలు ,సలాడ్లు, సూప్ లు , కోసం రకరకాల పిండి మాంసం కలిపి గిన్నెలను చేసేయచ్చు. రకరకాల ప్యాకింగులతో పర్యావరణనికి సమస్యలు లేకుండా  చేసే ఇలాంటి వస్తువుల వల్ల  చాలా  ప్రయోజనం.

Leave a comment