Categories

డ్రస్ లు ఎలాంటివైన సౌకర్యంగా ఉన్నవాటినే ధరించటం ఈ తరం ఇష్టపడ్డే అంశం. ఉదాహరణకు అమ్మాయిలు జెగ్గింగ్ లు బావుంటాయంటారు. ఇవి చూసేందుకు డెనిమ్ జీన్స్ ల అనిపించినా లెగ్గింగ్స్ మాదిరే సౌకర్యంగా ఉంటాయి. లుక్ మాత్రం డెనిమ్ ఇచ్చిన అందం ఇస్తాయి. న్యూలుక్ లెగ్గింగ్స్ లో జతచేస్తే ఏ సందర్భంలో అయినా అందంగా వుంటాయి. ఏ డ్రస్ వేసుకొన్న చేతులు,మెడ నగలతో అలంకరించక పోయిన పర్లేదు. చక్కని డ్రస్ ఒక్కటే అందం ఇస్తాయి. కాస్త ఖరీదైన స్కార్ఫ్ మెడచుట్టు ధరించి ఆకార్యానికే నిండుదనం వస్తుంది. అలాగే వెడల్పాటి కళ్ళద్దాలు ఫలకీ లుక్ ఇస్తాయి.