దేశం లో అతి తక్కువ మహిళ అక్షరాస్యత నమోదైన రాష్ట్రం రాజస్థాన్. అక్కడి స్త్రీల అక్షరాస్యత 32 శాతానికి మించి లేదు దీనికి కారణం పేదరికం, నీటికొరత,బాల్యవివాహాలు,బ్రాహ్మణ హత్యలు ఇలా ఎన్నో కారణాలు. గర్భంలో ఆడపిల్ల ఉందని తెలిస్తేనే చంపేస్తారు. ఈ కారణాలు అధ్యయనం చేసిన సిటా అన్న ఎన్జీవో ఈ సమస్యలకు పరిష్కారం ఆడపిల్ల చదివే అని తేల్చుకొని 2018 లో ఇక్కడో స్కూలు నిర్మించింది. రాజస్థాన్ రాష్ట్రం, జైసల్మేర్ జిల్లా కానోయ్ గ్రామంలో, ది రాజకుమారి రత్నావతి గర్ల్ స్కూల్ అలా కట్టిందే. దీన్ని జ్ఞాన్ సెంటర్ అని పిలుస్తారు. నాలుగు వందల మంది బాలికలు ఇక్కడ చదువుకుంటున్నారు వీళ్ల యూనిఫామ్ ప్రముఖ డిజైనర్ సవ్యసాచి ముఖర్జీ రూపొందించారు. టెక్స్ టైల్ మ్యూజియం, ఎగ్జిబిషన్ హాలు సాంప్రదాయ హస్తకళల శిక్షణాలయం కూడా ఉన్నాయి .ఈ భవన నిర్మాణమే ప్రత్యేకం ఇది ఎకో-ఫ్రెండ్లీ భవనం. స్థానికంగా దొరికే పసుపుపచ్చని ఇసుక రాయితో దాన్ని కట్టారు. మూడు లేయర్ల తో చుట్టు వెంటిలేషన్ కోసం ఏర్పాటుచేసిన కిటికీలతో ఈ భవనం చాలా చల్లగా ఉంటుంది. అందుకే ఇందులో ఎయిర్ కండిషనర్ లు  లేవు భవనంపైన ఏర్పాటు చేసిన సోలార్ ప్యానల్స్ ఈ బడి కి కావలసిన కరెంటు ఉత్పత్తి చేస్తాయి .అమెరికా కు చెందిన ఆర్కిటెక్ట్ డయానా కెల్లాగ్ ఈ బడికి చక్కని రూపం పోసింది. అల్లా ఈ రాజకుమారి రత్నావతి గర్ల్స్ స్కూల్ ఏడాది ఎండల్లో చల్లని చదువుల బడి గా ప్రారంభం అయింది. ఈ జ్ఞాన సెంటర్ లో ఎంతో మంది చదువుల తల్లులు భవిష్యత్ లో బయటకు వస్తారో చూడాలి !

Leave a comment