నాకు కాస్త ధైర్యం ఎక్కువే.ధైర్యమే కనుక లేకపోతే నా కెరీర్ ఎప్పుడో ముగిసి పోయేది అంటుంది తాప్సీ పన్ను .నాకు ఎన్నో అపజయాలు ఎదురయ్యాయి.అయినా నేను భయపడలేదు సక్సెస్ కోసం ధైర్యంగా మళ్ళీ మళ్ళీ ప్రయత్నించాను మంచి కథా చిత్రాలు ఎంచుకునేందుకు కూడా ఆ ధైర్యమే దోహదపడుతోంది అని భావిస్తున్నాను.ధైర్యం తోనే ఇన్నేళ్లుగా ఈ పరిశ్రమలో నిలబడా గలుగుతున్నాను అంటోంది తాప్సీ. ఒక చిన్న అపజయం ఒక విమర్శ, ఒక సినిమా సక్సెస్ కాకపోవటం ఇవన్నీ బాధపెడతాయి కానీ అందులోంచి చాలా తొందరగా బయటపడి ఇంకో అవకాశం కోసం చూస్తాను అంటోంది తాప్సి.