కోర్ట్నీ లలోత్ర (కోర్టునే Lalothra) మన్ హట్టిన్ లో ఫ్యాషన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ చదువుతున్న సమయంలో ఫ్యాబ్రిక్ రీసెర్చ్ ప్రాజెక్ట్ లో భాగంగా ఇండియా వచ్చింది. ఈశాన్య ఢిల్లీలో మురికివాడల్లో ఉన్న పిల్లలను చూసి చలించిపోయింది. అమెరికాలో తనకున్న ఆస్తులన్నీ అమ్మి 15 వేల డాలర్లతో ఇండియా వచ్చి ఒక స్వచ్ఛంద సంస్థతో కలిసి సామాజిక కార్యక్రమాలు చేపట్టింది. 2014లో యోగేష్ అన్న వ్యక్తిని ప్రేమించి పెళ్లాడాక వారికి పుట్టిన ‘ఎడి’ అన్న అబ్బాయి తో పాటు మరో 11 మంది అనాధ పిల్లలను దత్తత చేసుకున్నది. ఈ కోవిడ్ కాలంలో కోర్ట్నీ రోజు కొన్ని వేల మంది అనాధలకు సహాయం చేస్తుంది.