సైబర్ మిషన్ పేరుతో వివిధ రాష్ట్రాల్లోని వేల మంది పోలీస్ లకు శిక్షణ ఇస్తోంది కామాక్షి శర్మ ఘజియాబాద్ కు చెందిన కామాక్షి శర్మ డిజిటెక్ అనే కంపెనీ సి.ఐ.ఓ గా పని చేసింది. హ్యాకింగ్ పైన ఆసక్తితో ఎన్నో కోర్సులు చేసిన కామాక్షి సైబర్ నేరాలను అరికట్టటం తో పోలీసులకు సాయం చేయటం మొదలుపెట్టింది. సైబర్ ఇన్ వెస్టిగేషన్ కెరీర్ గా మార్చుకొంది. 35 రోజుల్లో 30 నగరాల్లో వర్క్ షాప్ నిర్వహించి 50 వేల మంది పోలీసులకు సైబర్ సెక్యూరిటీ పై శిక్షణ ఇచ్చింది. అలా వరల్డ్ యంగెస్ట్ సైబర్ ఇన్వెస్టిగెటింగ్ ట్రైనర్ గా రికార్డుల్లో ఎక్కింది. వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్ ఆసియా బుక్ ఆఫ్ రికార్డ్స్ లో స్థానం దక్కించుకుంది.