మనిషి మనసులో మంచితనం ఉంటే అది ప్రపంచాన్ని తెచ్చి ఇస్తుంది అంటుంది సినిమా కేశవ్ కి ఆయన తాత వైద్యం నేర్పి తన సైకిల్ ను బహుమతిగా వారసత్వంగా ఇచ్చి చనిపోతాడు.కేశవ్ ఆ చుట్టుపక్కల పల్లెలకు ఆ సైకిల్ పైన వెళ్లి వైద్యం చేస్తూ ఉంటాడు ఒకరోజు ఇద్దరు దొంగలు ఆ ఊర్లో ఒక ధనవంతుడి ఇంట్లో చోరీ చేసి ఇంటి ముందున్న సైకిల్ ను తీసుకొని పారిపోతారు.కేశవ్ కు నిరంతరం ఆ సైకిల్ ధ్యాసే ఇటు చూస్తే సైకిల్ దొంగలకు ఏ ఊరు వెళ్లిన ఆ సైకిల్ ను గుర్తుపట్టిన గ్రామస్తులు ఎంతో ఆదరిస్తూ కేశవ్ ని గుర్తు చేసుకుంటారు కేశవ్ పెదనాయన పిల్లలం అని చెప్పుకొన్న దొంగలకు సమస్త ఉపచారాలు చేస్తారు. కేశవ్ మంచితనం అర్థం చేసుకున్న దొంగలు ఆ సైకిల్ కేశవ్ కు ఇచ్చేస్తారు ఈలోగా గ్రామస్తులు ఇంకో కొత్త సైకిల్ ని కేశవ్ కోసం తెస్తారు.ఈ కేన్స్ ఫిలిం ఫెస్టివల్ లో ప్రదర్శించిన ఈ చక్కని సినిమా నెట్ ఫ్లిక్స్ లో ఇంగ్లీష్ సబ్ టైటిల్స్ లో ఉంది.
Categories
రవిచంద్ర.సి
7093440630