Categories
బేకింగ్ సోడా తో ఇంకెన్నో ఉపయోగాలున్నాయి అంటున్నారు ఎక్స్ పర్ట్స్ . ఇంట్లో దుర్వాసన పోగోటెందుకు రూమ్ ఫ్రెషనర్స్ వాడుతువుంటాం. బేకింగ్ సోడాతో తయారు చేసిన రూమ్ ఫ్రెషనర్ కూడా అంత శక్తి మంతంగాను పని చేస్తుంది రెండు కప్పుల నీళ్ళలో టేబుల్ స్పూన్ బేకింగ్ సోడా వేయాలి. దాన్ని స్ప్రే చేస్తే పెర్ఫ్యూమ్ లగే పని చేస్తుంది . తలుపులు వేసిన ఇంట్లో వచ్చే మాగుడ వాసనా పోతుంది. వంట గదిలో నూనె మరకలు పడిన చోట ఈ బేకింగ్ సోడా చల్లితే నూనె ను పీల్చు కుంటుంది . తర్వాత తుడి చేస్తే సరిపోతుంది. పళ్ళు పసుపు రంగులో వుంటే ,కొబ్బరి నూనె కాస్త వేడి చేసి ,బేకింగ్ సోడా కలిపి కాసేపు ఫ్రిజ్ లో పెట్టి దంతాలు పైన మరకలు పోతాయి.