మెనోపాజ్ ముందర కొంతమందిలో హార్మోన్స్ ఇన్ బ్యాలెన్స్ లక్షణాలుంటాయి. బరువు పెరగటం కీళ్లనొప్పి,తలనొప్పి చెమట పోయటం మొదలైన ఇబ్బందులు రాత్రిపూట చిరాకు పెడుతూ ఉంటాయి హార్మోన్స్ తక్కువగా ఉన్న వాటి పని అవి చూసుకు పోవాలంటే ముఖ్యంగా సమయానికి నిద్రపోవడం మాంసకృత్తులు ఉన్న ఆహారం తినటం వ్యాయామం చేయడం వల్ల శరీరం చురుగ్గా ఉంటుంది.హార్మోన్స్ సవ్యంగా పనిచేస్తాయి. ప్రతి రోజూ నిద్రపోయే ముందర వేడి పాలు లేదా సోయా పాలలో బెల్లం లేదా గుల్కండ్ కలుపుకుని తాగాలి ఆహారంలో బొబ్బర్లు ఉండేలా చూసుకోవాలి.గుమ్మడి గింజలు నువ్వులు స్నాక్స్  గా తీసుకోవాలి. ఒక పూటైనా  పెరుగు మజ్జిగ తీసుకోవాలి.

Leave a comment