ప్రతి ఇంటిలో ఇప్పడు వైరల్ జ్వరాలను చూస్తున్నాం..వర్షా కాలంలో అందరిని భయపెడుతున్న వైరల్ ఫీవర్లలో డెంగ్యూ ఫీవర్ ఒకటి…డెంగ్యూ జ్వరం అంటే ఏమిటో ఇప్పుడు చూద్దాం..డెంగ్యూ ఫీవర్ దోమల వలన వ్యాపించే వైరల్ జ్వరం. Aedes aegypti(ఏడిస్ ఈజిప్ట్)అనే జాతి దోమకాటు వల్ల మానవ శరీరంలోకి ప్రవేశించే వైరస్ వల్ల వచ్చేది డెంగ్యూ జ్వరం. ఏడిస్ అనే ఆడ దోమ ఈ వైరస్ ను ఒక వ్యక్తి నుంచి ఇంకో వ్యక్తికి వ్యాపింపజేస్తుంది.
ఇది వర్షాకాలంలో అధికంగా కనిపిస్తుంది. ఏడిస్ అనే ఆడ దోమకాటు వల్ల ఒకరి నుంచి మరొకరికి డెంగ్యూ వైరస్ వ్యాప్తి చెందుతుంది…ఈ డెంగ్యూ వైరస్ లో 5 రకాలు ఉన్నాయి 1,2,3,4,5. ఒక వైరస్ రకం ఇప్పుడు జ్వరాన్ని వచ్చేట్టు చేస్తే మళ్ళీ జీవిత కాలంలో ఆ వైరస్ వల్ల జ్వరం రాదు. కానీ మిగతా నాలుగు రకాల్లో మళ్ళీ ఏదైన వస్తే మటుకు బాగా తీవ్రంగా వచ్చి కాంప్లికేషన్స్ కు దారి తీయవచ్చు. ఈ వైరస్ కలిగి ఉన్న దోమ కుట్టిన 3 నుంచి 14 రోజుల్లో 101 నుంచి 105 డిగ్రీల ఫారన్హీట్ జ్వరం హఠాత్తుగా వస్తుంది. తీవ్రమైన తలనొప్పి, కళ్లు మండటం, ఒళ్లునొప్పులు, కడుపులో తిప్పడం, వాంతులు వంటి లక్షణాలు కనిపిస్తాయి..చిన్న పిల్లలో జలుబు, విరోచనలు ఉంటాయి.
80శాతం మందిలో ఏ కాంఫ్లికేషన్స్ లేకుండా జ్వరం తగ్గిపోతుంది.5 శాతం మందిలో జ్వరం తగ్గిన 24 నుంచి 48 గంటల తరువాత రెండవ దశలో కాంఫ్లికేషన్స్ రావచ్చు.
1)బి.పి తగ్గిపోవటం, ఇది రక్త నాళాలలో ఉన్న నీరంతా పొట్టలోకి చేరటం వల్ల జరుగుతుంది.
2)రక్తంలో ఫ్లేట్ లెట్స్ కణాలు తగ్గటం వల్ల రక్తస్రావం జరగవచ్చు.
3)శరీరం రోగి యొక్క వివిధ అవయవాలపై ముఖ్యంగా కాలేయం, గుండె, మెదడు పై ప్రభావం చూపవచ్చు.
ఇక రికవరీ దశలో తీవ్రమైన దురదలు, గుండె తక్కువ కొట్టుకోవటం ,మెదడుకు రక్త సరఫరా తగ్గటం వల్ల స్పృహ కోల్పోయి ఫిట్స్ రావటం ,నిస్త్రాణం వంటివి ఉండవచ్చు.
డెంగ్యూ జ్వరం పరిక్షల ద్వారా నిర్ధారించనవసరం లేదు.జ్వరం ,వళ్ళు నొప్పులు, దద్దుర్లు వంటి లక్షణాలను బట్టి డాక్టర్లు డెంగ్యూ జ్వరం అని చెప్తారు. . తొలి దశలో NS1 యాంటిజెన్-యాంటీ డెంగ్యూ యాంటీబాడీలతో రోగనిర్ధారణ చేయవచ్చు. 4 నుంచి 5 రోజుల తర్వాత IgM and IgG పరీక్షల ద్వారా నిర్ధారించవచ్చు.
మొదటి దశ అయినటు వంటి జ్వర దశలో పారాసిటమాల్ 650mg ట్యాబెట్ల్ ప్రతి ఆరు గంటలకు జ్వరం ఉంటే తీసుకోవాలి. తడి గుడ్డతో వళ్ళు తుడవటం ద్వారా జ్వరాన్ని తగ్గించవచ్చు. ఈ దశలో డాక్టర్ని కలిసి రక్త పరీక్ష (HB,PCV)రోజు విడిచి రోజు చేయించుకోవటం మంచింది. డీహైడ్రేషన్ రాకుండా బాగా ద్రవ పదార్థాలు తీసుకోవటం చాలా ముఖ్యం..
మొదట జ్వరం దశ తగ్గే సమయంలో ఈ క్రింద సూచించిన రెండో దశకు సంబంధించిన ప్రమాద సూచనలు కనపడితే వెంటనే డాక్టర్ని సంప్రదించాలి.
1)తీవ్రమైన కడుపు నొప్పి..
2)వాంతులు అవ్వటం..
3)గాలి అందక పోవటం.
4)చిగుళ్ళ నుంచి రక్తం కారటం.
5)తీవ్రమైన అలసట
6)ఆదుర్ధగా ఉండటం, మగత, వాంతిలో రక్తం పడటం, మూత్రం తక్కువ నడవటం, వంటికి నీరు పట్టడం.
ఈ దశలో HB,PCV పెరిగి , ఫ్లేట్ లేట్స్ తగ్గుతాయి. వెంటనే ఆస్పత్రిలో చేరితే ..డాక్టర్ సెలైన్స్ ఎక్కించి ప్రాణాన్ని కాపాడుతారు…పేషెంట్ పరిస్థితి నిలకడగా ఉంటే ఫ్లేట్ లెట్స్ ఎంత తగ్గినా ఎక్కించనవసరం లేదు. ఎక్కడైనా రక్త స్రావం అవుతుంటే మాత్రం రక్తం ఎక్కించవలసి ఉంటుంది.
డెంగ్యూ జ్వరం- నివారణ
ఇంటి పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకుని దోమలు చేరకుండా చూసుకోవడం ద్వారా నివారించవచ్చు. దీనికి టీకా మందు లేదు. జ్వర లక్షణాలు కనిపిస్తే వీలైనంత త్వరగా వైద్యపరీక్ష చేయించుకోవాలి. ద్రవపదార్థాలు అధికంగా తీసుకోవాలి. పళ్లరసాలు లేదా కొబ్బరినీళ్లలో గ్లూకోజ్ కలుపుకొని తాగాలి. పూర్తిగా విశ్రాంతి తీసుకోవాలి. రాత్రిపూట బాగా నిద్ర పోవాలి. దోమతెరలు, దోమలను పారదోలే రసాయనాలను వాడాలి. నిలవ నీరు లేకుండా చూసుకోవాలి. శరరం పూర్తి కప్పి ఉంచే దుస్తులు ధరించాలి..జ్వరం ఉన్న వారిని దోమ తెరలో ఉంచటం ద్వారా ఇంటిలోని మిగతా వారికి జ్వరం రాకుండా చేయవచ్చు..
డాక్టర్ గీతా దేవి, MD DGO
సీనియర్ కన్సల్టెంట్ గైనకాలజిస్ట్ ,
ఆయూష్ హాస్పిటల్స్.
సెల్ :+91 99483 43888.