ప్రకృతి అంటేనే మ్యూజిక్ తో పాటు మిరాకిల్ కూడా. సూర్యోదయ, సూర్యాస్తమయాలు. పక్షుల కిలకిల రావాలు చూస్తూ జీవించటం నాకెంతో ఇష్టం నాలోని ఆశావహ దృక్పథమే నా సౌందర్యం అంటుంది అదితి రావు హైదరి. మనిషిలో ఆనందం కూడా ఒక మైండ్ సెట్ మాత్రమే చిన్న చిన్న సంతోషాలు కూడా నాకు ఎనర్జీ ఇస్తాయి. మంచి ఆహారం ఇష్టమైన సంగీతం నచ్చిన పని చేయటం నా దృష్టిలో ఆనందం. మనసు ఆనందంగా ఉంటే సహజంగా అందంగా ఉంటాను అంటుంది అదితి. నా స్కిన్ టోన్ చూసి నేను లేపనాలు వాడతాను అనుకుంటారు కానీ అన్ని సహజమైనవే తులసి అలోవెరా పెరుగు నిమ్మకాయ వంటివే వాడతాను సినిమాల్లోనే మేకప్ తో కనిపించేది మిగతాదంతా అందరూ అమ్మాయిల్లాగే మామూలుగా ఉంటాను అంటుంది అదితీరావ్.

Leave a comment