“అనంతకోటి బ్రహ్మండనాయక రాజాధిరాజ,యోగిరాజ,పరబ్రహ్మ శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ కీ జై”.
హైదరాబాద్ దిల్షుక్నగర్ సాయిబాబా ప్రత్యక్ష దైవం.బాబా విగ్రహం దర్శించిన సర్వ రోగ,పాప నివారణం.బాబా భక్తులు తమ మనసులో ఉన్న కోరికలు తీర్చే స్వరూపుడుగా ప్రతి గురువారం సాయంత్రం సాయిబాబా భజనలు చేసి స్వామి వారి సన్నిధిలో పల్లకి సేవతో తరిస్తారు. సాయిబాబా వారి సన్నిధిలో అన్నదానం, వస్త్రదానం,పేదవారికి ఉచిత వైద్య సేవలు అందించడం జరుగుతుంది.సాయి మందిరం లో పారాయణం చేసి స్వామి ఆశీస్సులు పొందుతారు.బాబావారికి కాకడ హారతి, దుపారి హారతి, దూప్ హారతి, సేజ్ హారతులతో ఆలయ ప్రాంగణం పవిత్రతతో భాసిల్లుతుంది.
ఇష్టమైన రంగులు: కాషాయం,తెలుపు, పసుపు.
ఇష్టమైన పూలు: అన్ని రకాల పుష్పాలుతో అలంకరించి సేవ చేసే భాగ్యం.
నిత్య ప్రసాదం: కొబ్బరి,శనగ గుగ్గిళ్లు.
శనగ గుగ్గిళ్లు తయారీ: ముందు రోజు రాత్రి శనగలు నానబెట్టాలి. మరుసటి రోజు ఉదయం ఉడికించి పక్కన పెట్టుకోవాలి.మూకుడు పెట్టి నూనె వేడి చేసి ఆవాలు, శనగ పప్పు,మినప్పప్పు, ఎండుమిరపకాయల్ని, కర్వేపాకు వేసి ఉడికించిన శనగలు తగినంత ఉప్పు వేసి వేయించాలి.అంతే!!
సాయంత్రం సాయిబాబా కి దూప హారతి సమయంలో నైవేద్యం పెట్టి ఇష్టమైన భజనలు చేసి స్వామి వారి కటాక్షం పొందటమే.
-తోలేటి వెంకట శిరీష