లైంగిక వేధింపులు అన్నవి ఈ మధ్య కాలంలో ఎక్కువయ్యాయి. ఈ విషయంలో వయసుతో సంబంధం లేకుండా జరుగుతున్నాయి. అన్ని రంగాల్లో ఉన్న ఆడవాళ్ళు ఇప్పుడు ఈ వేధింపుల విషయంలో నోరు విప్పి చెబుతున్నారు. ఇప్పుడు దీనికి వ్యతిరేకంగా స్పందిస్తున్నారు. మాజీ విశ్వసుందరి సుస్మితాసేన్ ఈ వేధింపుల గురించి తన అనుభవాన్ని బాధపడుతు చెప్పింది. ఓ అవార్డు కార్యక్రమంలో తనను ఎవరో వెనక నుంచి వేధిస్తున్నట్లు అనిపించిందట వెంటనే ఆమె తనకు వెనుక తాకుతున్న చేయిని పట్టి ముందుకు లాగితే ఆ వ్యక్తిని చూసి తనకే కళ్ళ నీళ్ళు వచ్చాయి. ఇంతకి ఆమెని అసభ్యంగా తాకిన అబ్బాయికి 15 సంవత్సరాలు కూడా ఉండవట. వాడి తల్లి వయసులో ఉన్న నా పైన ఇలా ప్రవర్తించటం చూసి నాకు కళ్ళ నీళ్ళు ఆగలేదు అని చెప్పుకొచ్చింది సుస్మితా సేన్.

Leave a comment