Categories
పిల్లలు చిన్న తనం లో నేర్చుకునే అలవాట్లే జీవితకాలం కొనసాగుతాయి.వాళ్ల ప్రవర్తన కు సంబంధించి చాలా అంశాలు పెద్దవాళ్ళను అనుసరించి అలవాట్లు చేసుకొనేవే. ముఖ్యంగా మాట తీరుపైన పెద్దల ప్రభావం ఎక్కువగా ఉంటుంది.పెద్దవాళ్లు కోపంగా అసహనం గా ఉంటే పిల్లలకి అదే అలవాటు అవుతుంది.తల్లి తండ్రి కలివిడిగా ఉండే మనస్తత్వం తో ఉంటే స్నేహ పూరితంగా వ్యవహరిస్తే పిల్లల తత్వము అలాగే ఉంటుంది. కనుక పిల్లల వ్యక్తిత్వానికి అమ్మానాన్నలే ఆదర్శం పిల్లలకు మర్యాద మన్నన నేర్పాలి మర్యాదగా పలకరించడం ఇంటికి వచ్చిన వాళ్ళతో స్నేహంగా నవ్వుతూ మాట్లాడటం వాళ్ళకి అలవాటు చేయాలి. ఎవ్వరినీ హేళన చేస్తూ మాట్లాడ నీయకుండా శ్రద్ధగా చూడాలి.స్కూల్లో పిల్లల దగ్గర, ఇంట్లో మాట్లాడుతూ విని అనుచితమైన మాటలు మాట్లాడుతుంటే ముందే తుంచేయాలి. స్పష్టంగా సూటిగా చక్కగా మాట్లాడే విధంగా శిక్షణ ఇవ్వాలి. పిల్లలకు మొదటి గురువు తల్లి,అటు తర్వాత తండ్రి
చేబ్రోలు శ్యామ సుందర్
9849524134
9849524134