పశ్చిమ బెంగాల్ డార్జిలింగ్ జిల్లాలోని సిలిగురి లో ఎలక్ట్రిక్ రిక్షా నడిపిన తొలి మహిళ మున్మున్ సర్కార్.(మున్మున్ సర్కార్) గత ఆరున్నర సంవత్సరాలు గా ఆమె నడుపుతోంది ఈ రిక్షాను టోటో అని పిలుస్తారు.ఈ టోటో లు నడిపే మహిళల బృందానికి నాయకురాలు కూడా. కరోనా సోకిన వాళ్ళను తన రిక్షాలో ఆస్పత్రికి చేరుస్తుంది మున్మున్.ఈ రిక్ష వెనుక భాగం ప్లాస్టిక్ కవర్ తో కప్పి ఉంటుంది.కరోనా వచ్చిన వాళ్లకు ఆహారం అవసరమైన వస్తువులు వారి దగ్గరకు చేరుస్తాను. దానికి నేను డబ్బు తీసుకోను అంటోంది మున్మున్.ఈమె 12వ తరగతి వరకు చదువుకుంది. మొట్టమొదటి ఎలక్ట్రిక్ రిక్షా నడిపింది. ఈమె స్పూర్తితో ఇప్పుడు 188 మహిళలు ఈ టోటో లు నడుపుతున్నారు.