Categories
వంట గ్యాస్ ఆదా చేసేలా కొన్ని టిప్స్ పాటించవచ్చు అన్నం,పప్పు,కూర గాయాలు వంటివి ఒకే సారి వేరేరు గిన్నెల్లో ప్రెషర్ కుక్కర్ లో పెట్టి ఆవిరితో ఉడికిస్తే ఇటు ఆరోగ్యం అటు గ్యాస్ ఆదకూడ. కూర పొయ్యిపైన పెట్టి ,మూత పెట్టి సన్నని మంటపైన ఉడికిస్తే రుచిగా ఉంటుంది. మూత పెట్టటం వల్ల త్వరగా ఉడుకుతుంది. స్టీల్ అడుగు ఉన్న గిన్నెల కన్నా ఇనుప పాత్రలు,రాగి అడుగు ఉన్నా పాత్రలు వాడటం మంచిది . పాత్రలు వేడెక్కితే అధిక సమయం ఆవేడి ఉంటుంది . గ్యాస్ తక్కువ ఖర్చు వుతుంది . స్టవ్ కు తగ్గట్టు గిన్నె పరిమాణం ఉండాలి . వంట అవగానే గ్యాస్ బర్నర్ లు శుభ్రం చేయాలి లేకపోతే వంట వ్యర్దలు బర్నర్ చుట్టూ చేరి గ్యాస్ సరిగా రాదు . దానితో మంట పసుపు రంగులో వస్తుంది . గ్యాస్ అనవసరంగా వృధా అవుతుంది .