జెనీవా లోని ప్రపంచ ఆరోగ్య సంస్థ లో చీఫ్ సైంటిస్ట్ డాక్టర్ సౌమ్య స్వామినాథన్ కరోనా కు వాక్సిన్స్ ను డ్రగ్ థెరపీ లను కనిపెట్టేందుకు ప్రపంచ వ్యాప్తంగా జరుగుతున్న శాస్త్ర పరిశోధనా కార్యాచరణకు నేతృత్వం వహిస్తున్నారు. వ్యాక్సిన్ సిల్వర్ బుల్లెట్ కాదు, డ్రగ్స్ కూడా అవసరమేనన్నారు. వ్యాధి తీవ్రతను తగ్గించేది ఔషధాలు మాత్రమే అని డబ్ల్యూహెచ్వో చీఫ్ సైంటిస్ట్ సౌమ్య స్వామినాథన్ తెలిపారు. అందుకే ఔషధాల అంశంలోనూ ప్రయోగాలు జరుగుతున్నట్లు ఆమె వెల్లడించారు.