Categories
చర్మంలోని నూనె ఉత్పత్తి తగ్గిపోవటం వల్ల ,నీటిశాతం తక్కువై తేనే చర్మం పొడిబారి పోతుంది . రాబోయే చల్లని కాలంలో ఈ సమస్య చాలా ఎక్కువ . ఈ పొడి చర్మాన్ని మాయిశ్చరైజర్ చేసుకోవాలి . చర్మంలో ఆయిల్ లెవల్స్ మెయిన్ టెయిన్ చేయటం వల్ల తేమతో ఉండి చర్మం పొడి బారిపోకుండా ఉంటుంది . సాధారణ లోషన్లు కంటే అయిల్ క్రీమ్స్ వాడాలి . షియాబటర్సహజ నూనెలు విటమిన్ ఇ ఉన్న మాయిశ్చరైజర్ ఎంచుకోవాలి . రోజుకు రెండు లీటర్ల నీటిని తాగాలి తేలికపాటి జల్ ఆధారిత సబ్బులు వాడుతూ ఉంటె స్నానం తర్వాత చర్మం పొడిబార కుండా ఉంటుంది .