Categories
![ప్రేమతో వండి వడ్డించు అంటే ఈ కాలపు అమ్మాయికి అర్ధం అవుతుందా ? వంట అంటే కుకింగ్ అంతే కానీ ఎలా వండితే ఏం దానికి ప్రేమ యాడ్ చేయటానికి అదేమైనా అల్లామా ? ఉల్లిపాయ ? కాకపోవచ్చు . కానీ ప్రేమతో ఇష్టంతో చేసిన వంట అంటే తప్పనిసరిగా రుచిగానే ఉంటుంది. ప్రేమగా ఇష్టంగా వండితే శ్రద్ధగా వండుతాం కదా ఏలోపం రాకుండా అవతలివాళ్ళకు ఆ ఇష్టం చేరాలన్నంత తపన తో వండుతారు కనుక తినేవాళ్లకు కూడా ఆ మెసెజ్ చేరుతుంది. వంట చేసిన వాళ్ళ పట్ల ఇష్టంతో తినేవాళ్లు తింటారు కనుక రుచి అద్భుతంగా ఉంటుంది. గందర గోళం ఎందుకు గని ఒక ఉదాహరణ ఆస్పత్రి లో రోగులను ప్రేమతో పలకరిస్తూ పీక నర్స్ ఇంజెక్షన్ చేస్తే పుట్టే నొప్పికీ చిటపటలాడుతూ చేసే నొప్పికీ తేడా ఉంటుంది. అలా మొహం మాడ్చుకుంటే ముందు జబ్బు ఎక్కువవుతుంది. ఏమంటారు ? అలాగే పేమకు రుచి పెంచే గుణం ఉండటమే కాదు ప్రేమ భారీ నివారిణి కూడా. ఇది సరైన పరిశోధనే కదా !](https://vanithavani.com/wp-content/uploads/2017/03/serving-food.jpg)
ఎంతోసేపు టీవి చూసి ,పుస్తకాలు చదివి ,కంపూట్యర్ ముందు వర్క్ చేసుకొని రాత్రి వేళ చాలా ఆలస్యంగా భోజనం చేయటం వెంటనే నిద్ర పోయేందుకు ప్రయత్నం చేస్తారు. కానీ ఇది ఆరోగ్యానికి మంచిది కాదంటున్నారు ఎక్స్ పర్ట్స్. ఆహారం అరగక జీర్ణ సంబంధిత అనారోగ్యాలు కలగటం ఒకటి.అలాగే ఇది హార్మోన్ ఉత్పత్తిని నియంత్రించే ఎండోక్లైమ్ వ్యవస్థను ప్రభావితం చేస్తుందనీ అంటారు. 1.3 మిలియన్ల మంది పాల్గొన్న ఒక అధ్యయనంలో రాత్రి వేళ నిద్ర తక్కువైతే జీవన ప్రమాణం కూడా తక్కువగానే ఉంటుందని తేలింది. రాత్రి ఎనిమిది గంటలకే భోజనం ముగించి పదినిమిషాలు నడిచి సాధ్యమైనంత త్వరగా నిద్రపోతేనే మంచిదంటున్నాయి అధ్యయనాలు.