డయాబెటిక్ బారిన పడిన పెద్దవాళ్ళకి కాళ్ళు చేతులు తిమ్మిర్లు రావటం సహజం . రక్తంలో చక్కర స్థాయి చాలాకాలం నుంచి అధికంగా ఉండే నరాలు దెబ్బతిని కళ్ళు చేతులు తిమ్మిర్లు వస్తాయి . దాన్ని డయాబెటిక్ న్యూరోపతి అంటారు . దీనికి మందులు తీసుకొంటున్నా ,ఆహారంలో మార్పుల వల్లనే ఎక్కువ ఉపశమనం కలుగుతుంది .  తెల్లని రైస్ కి బదులు బ్రౌన్ రైస్ ,గోధుమలు రాగులు సజ్జలతో చేసిన జావా ,రొట్టెలు తీసుకోవాలి . ఒకేసారి ఎక్కువ మోతాదులో కాకుండా ఐదారు సార్లు గా కొద్దికొద్దిగా ఆహరం తీసుకోవాలి . అన్నం ,రొట్టెలు ఏది తీసుకొన్న కూర,పప్పు అన్నం కంటే ఎక్కువ ఉండాలి నడక కూడా చాల అవసరం నడకవల్లే చక్కర స్థాయిలు తగ్గుతాయి .

Leave a comment