లాక్ డౌన్ లో ఇంట్లో నే కూర్చుని ఎంచక్కా వర్క్ ఫ్రమ్ హోమ్ హాయిగా ఉంటారనుకొంటారు .కానీ గంటలకొద్దీ కదలకుండా కూర్చుంటే ఎన్నో శారీరక నొప్పులు వస్తాయి .నడుము , కాళ్ళు బొటన వేళ్ళు , ముంజేయి ఇలా శారీరక భాగాల్లో చీరాకు పెట్టి నొప్పులు సాగు తుంటాయి చూసుకోండి అంటున్నారు ఎక్స్ పర్డ్స్ .పని తప్పదు కనుక తగిన  జాగ్రత్తలు తీసుకోండి అంటున్నారు .మధ్యలో లేచి నిలబడటం కాస్సేపు అటూ ఇటూ తిరగటం చిన్నచిన్న హ్యాండ్ వెయిట్స్ లేపుతుంటే భుజాలు పట్టుకోకుండా ఉంటాయి .ఒకే పొజిషన్ లో గంటకు మించి కూర్చో కూడదు .కీ బోర్డ్ కళ్ళ లెవల్ కు సౌకర్యంగా ఉండాలి .పని మధ్య మధ్య లో లేచి స్ట్రెబ్బింగ్ ఎక్సర్ సైజ్ చేస్తే నొప్పులుండవు .

Leave a comment