లాక్ డౌన్ తో కుటుంబంలో అందరూ ఇంట్లోనే ఒకే చోట ఉంవలసి వస్తుంది .బయటకు పది నిముషాలు కూడా వెళ్ళే అవకాశం లేదు .ఇలాటి సమయంలో ఇతరులతో సహనంగా ఓర్పుగా వ్యవహరించాలి అంటున్నారు ఎక్స్ పర్డ్స్ .ఎవరికీ వాళ్ళు కు సొంత అభిప్రాయాలూ ఉంటాయి . మనం అంగీకరించని అభిప్రాయాలూ వాళ్ళకు ఉండవచ్చు .అందుకే వాదనలు మనాలి .ఇతరులను నొప్పించకుండా పాజిటివ్ గా సంతోషంగా ప్రవర్తించాలి .మనపై మనకు ఎలాటి గౌరవం ఉంటుందో దాన్ని ఎదుటి వాళ్ళ పట్ల చూపించాలి .ఇంట్లో కుటుంబ సభ్యులు కూడా మనవంటి వత్తిడి తోనే ఉన్నారని అర్ధం చేసుకొని అనవసరపు గొడవలు, కోపం, అసహనం వంటివి ప్రదర్శించకుండా ఓర్పుగా వ్యవహరించ మంటున్నారు ఎక్స్ పర్డ్స్ .ఈ లాక్ డౌన్ సమయంలో ఇంట్లో ప్రశాంతత ఉండేలా చేయటం అందరి బాధ్యత అనుకోవాలి .

 

Leave a comment