Categories

ఆభరణాల తయారీలో ఎప్పటికప్పుడు కొత్త డిజైన్లు వస్తున్నాయి అని చెప్పటం కంటే పాతకాలపు నాటి ఆభరణాలే కొత్త సొగసులు అద్దుకొంటున్నాయి అని చెప్పచ్చు. ఇప్పుడు రిస్ట్ బాండ్ అన్న పేరుతో ఉన్న చేతికి అమర్చుకొనే ఆభరణం,పర్షియన్ కాలంలో బ్రాస్ లెట్ గా రోమన్ల కాలంలో చేతిని రక్షించుకొనే ఆభరణంగా తెలుస్తోంది. అనేక వరసల్లో ముత్యాలు రాళ్ళు ,బంగారు బిళ్ళలు అతుక్కొని ఉండే ఆభరణం ఒకప్పటి సంప్రదాయ తయారీనే.ఇవాళ్టి ఫ్యాషన్ బ్రాస్ లెట్ మొఘల్,రాజస్థాన్,పర్షియన్ ల రాజరికపు రోజుల నాటిదే..