ప్రపంచవ్యాప్తంగా, స్ఫూర్తిదాయకంగా ప్రభావవంతంగా నిలిచిన 100 మంది మహిళల జాబిదాను బి.బి.సి ప్రకటించింది ఈ 100 ఉమెన్ జాబిదాలో రిధిమా పాండే ఉంది. పర్యావరణ పరిరక్షణ కోసం కృషి చేసే రిధిమా వయసు 12 ఏళ్లు. వాతావరణం మార్పుల విషయంలో భారత ప్రభుత్వం ప్రదర్శిస్తున్న అలసత్వాన్ని ప్రశ్నిస్తూ తొమ్మిది ఏళ్ళ వయసు లోనే ఆమె నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్’లో పిటిషన్ వేసింది. 2019 లోగ్రెటా థన్‌బెర్గ్ లాంటి మరో 15 మంది బాలల కార్యకర్తలతో కలిసి ఐదు దేశాలకు వ్యతిరేకంగా ఐరోపా బాలల హక్కుల కమిటీ ఫిర్యాదు చేసింది. పర్యావరణం, జీవవైవిధ్యాన్ని కాపాడవలసిన అవసరం గురించి తోటి విద్యార్థులను జాగృతం చేసేందుకు ఇప్పుడు కృషి చేస్తోంది.