ఇంట్లో ఏదో ఒక మూల గోడ గడియారం తప్పని సరి మరి. ఆ గడియారం ఇంకాస్త అందంగా పువ్వులు పండ్ల సొగసులతో లెదర్ తో తయారు చేస్తున్నారు కళాకారులు.లెదర్ ఫ్లవర్ త్రీడీ ఆర్ట్ పేరుతో ఇవి నిజమైన పువ్వుల్లా పండ్లలా ఉంటాయి. తోలు తో పాటు వెదురు కర్రలు ఉపయోగించి చేసేవే ఈ గడియారాలు ఇంటీరియర్స్ లో ముఖ్యమైన భాగం అయిపోయాయి. ఈ లెదర్ వాల్ క్లాక్స్ లో క్వార్టజ్ వాచ్ కి డయల్ భాగం కూడా లెదర్ తోనే చేస్తారు.ఈ గడియారం చుట్టూ  తూ లిప్ లు గులాబీలు, పొద్దు తిరుగుడు వంటి పువ్వులను లెదర్ తోనే తీర్చిదిద్దుతున్నారు .

Leave a comment