నైట్ డ్రెస్ ఎప్పుడు హోమ్లీ వేర్ .ఇప్పుడు వర్క్ ఫ్రొం హోమ్ తో అమ్మాయిలు,అబ్బాయిలు ఇళ్లకే పరిమితం అయిపోయి నైట్ కమ్  హోమ్ వేర్ డ్రెస్ ఏదైనా అందంగా ఫ్యాషన్ గా దొరికితే బావుండు అనుకుంటున్నారు.ఇంకేముంది వేసవికి కాటన్ ఫ్యాబ్రిక్ తో,చల్లగా గాలి తగిలేలా అందమైన నైట్ సూట్స్ వచ్చాయి. ఈ తరం అమ్మాయిలు నైటీలు వేసుకోరు ఆ నైటీ పొట్టిగా మోకాళ్ళ పైన గౌనులా ఉంటుంది.  ఈ పొట్టి గౌన్ లతో లాంగ్ టీ షర్ట్ లు, ఫ్రాక్స్,పొడవు కుర్తీలు, హ్యాండ్లూమ్ బ్లాక్ ప్రింట్స్ లో వస్తున్నాయి.ఈ నైట్ షర్ట్ ల్లో  స్లీవ్ లెస్,షార్ట్ స్లీవ్స్ ,లాంగ్ స్లీవ్స్ వంటి ఎన్నో వెరైటీలు ఉన్నాయి. పాతకాలపు నైటీలు కాస్త రూపం మార్చుకుని ఎన్నో ఫ్యాషన్స్ తో  ట్రెండీగా వస్తున్నాయి.

Leave a comment