ఆవకాయ పేరు చెబితేనే నోరు ఊరుతుంది.మరి ఈ కాలం అమ్మాయిలకు ఈ పెట్టే పద్ధతి,కొలతలు తెలియవు సీసాతో కొనుక్కుని తింటే, ఇంట్లో పచ్చడి  పెట్టుకున్న అనుభూతే రాదు అనుకుంటారు కదా. ఇలా పచ్చడి పెట్టుకోవటం రాని వాళ్ళకి ఆవకాయ కిట్ అందిస్తోంది లిఖిత భాను. ఈమె టెర్రా గ్రీన్స్ అనే స్టార్టప్ ప్రారంభించి రైతులు పండించిన వందకు పైన ఉత్పత్తులను మార్కెటింగ్ చేస్తుంది.హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో సేంద్రియ వ్యవసాయం చేస్తోంది.ఇందులో భాగమే ఆవకాయ కిట్ లో మామిడి మొక్కలు,నూనె ఆవపిండి జాడీ లతో సహా సర్వం ఉంటాయి. కిట్ తీసుకొని అన్ని కలుపుకోవటమే పని.

Leave a comment