Categories
లాక్ డౌన్ సడలించారు. రాకపోకలు మొదలయ్యాయి కానీ అప్పుడే బంధువులు,స్నేహితులు ఇంటికి ప్రయాణాలు మొదలు పెట్టవద్దనే అంటున్నారు ఎక్స్ పర్ట్స్ . మరీ అవసరమైతే తప్ప ఇల్లే కదల వద్దు అంటున్నారు. తప్పదనుకుంటే ఎన్నో జాగ్రత్తలు తీసుకోవాలి.ఎవరి ఇంటికి వెళ్ళిన ఇంటి బయటే కాళ్లు చేతులు శుభ్రంగా కడుక్కుని లోపలికి వెళ్లాలి పసిబిడ్డలను ముద్దు చేయడం తాకటం వద్దు ఎవరితోనూ అతి సన్నిహితంగా కూర్చొని మాట్లాడకూడదు అమ్మమ్మలు ,నానమ్మలు చూడాలన్నా ఓ రెండు నెలలు ప్రయాణం వాయిదా వేసుకోవాల్సిందే. అందుబాటులో ఉన్న సాంకేతికతను వాడుకొని పరిస్థితులను అధిగమించాలి. ఫోన్లతో వీడియో కాల్స్ లోనే యోగక్షేమాలు కనుక్కోవాలి పెళ్ళిళ్ళు ,శుభకార్యాలు అయినా సరే వీడియోల్లో చూసి ఆనందించవలసిందే.