నేనూ వలస కార్మికుడినే అంటున్నాడు సోను సూద్ తెరపైన తిరుగులేని విలన్ గా నటించిన సోను సూద్ నిజ జీవితంలో ఇన్స్పైరింగ్ హీరో అనిపించుకున్నాడు లాక్ డౌన్ సమయాన వలస కార్మికులు వేలాది మంది రోడ్డున పడి నడిచిపోతుంటే చలించిపోయిన సోను సూద్ వాళ్లందరినీ ఇళ్లకు చేర్చే వరకు నిద్రపోలేదు. కరోనా సహాయ కార్యక్రమాల్లో భాగంగా జుహు లో వున్న తన హోటల్ ను కరోనా రోగులకు వైద్యం చేస్తున్న వైద్య సిబ్బందికి కేటాయించారు. ఇక ముంబై పరిసర ప్రాంతాల్లో వేలాది మందికి అన్నదానం చేశారు అలాగే ఇళ్లకు వెళ్లి పోవాలనుకొన్న వారి మొత్తం డేటా కలెక్ట్ చేసి కరోనా పరీక్షలు చేయించి తగిన జాగ్రత్తల తో బస్సులు ఏర్పాటు చేసి గమ్యస్థానాలకు పంపించాడు. కేరళలోని ఎర్నాకులం లో చిక్కుకుపోయిన 170 మంది మహిళలను ప్రత్యేక విమానం ఏర్పాటు చేసి ఒడిశా పంపించారు. ఈ రియల్ హీరో కి ప్రపంచ వ్యాప్తంగా పొగడ్తలు వెల్లువెత్తాయి.

Leave a comment