Categories
మంచి వాసనలు మనసుకు హాయిని కలిగిస్తాయి.అలగని అస్తామానం ఫ్రెషనర్లు వాడితే ఆ రసాయనాలతో ముందు ఆనారోగ్యం తప్పదు.సహజమైన ఎన్నో సువాసనలు ఇవ్వగలిగేవి నిత్యం వాడుకునే వస్తువుల్లోనే ఉన్నాయి. గిన్నెలో నీళ్ళు పోసి మరిగే నిళ్ళలో రెండు నిమ్మచెక్కలు వేస్తే ఇంట్లో సువాసన వస్తుంది. దాల్చిన చెక్క నుంచి వచ్చే సువాసన వత్తిడిని దూరం చేస్తుంది.దీనికోసం చెక్కని పొడిగా చేసి నిప్పుల పై వేస్తే ఆ వచ్చే పొగ సువాసన భరితంగా ఉంటుంది.సాంబ్రాణి పొగకు అలాంటి శక్తే ఉంటుంది.ఇంట్లో సాంబ్రాణి పొగ వేస్తే ఆద్యాత్మిక పరిమళంతో ఆ వాసన మెదడుని ఉల్లాసపరుస్తుంది.హాళ్ళో నిళ్ళు నిండిన పాత్రలో గులాబీలు చామంతులు వేసినా చక్కని సువాసన వస్తుంది.