Categories
WhatsApp

పిల్లల అలవాట్లకు పెద్దలే బాధ్యులు.

ఒక సర్వేలో 10 నుంచి 18 సంవత్సరాల వయస్సు గలవారు వారి పాకెట్ మనీ తో 85 శాతం బయట చిరు తిండ్లకు కర్చుచేస్తున్నారని తేలింది. ఎక్కడ చూసినా రెస్టారెంట్స్, కేఫులు కలర్ ఫుల్ గా రుచిగా ఎన్నో పదార్ధాలు పిల్లలు సహజంగానే బయట తిండి కోరుకుంటారు. అసలు పెద్దల ఆహారపు అలవాట్లే పిల్లల పై ప్రభావం పడుతుంది. వాళ్ళు నిర్ణయాత్మకంగా ఆహారం ఎంచుకోవాలంటే పెద్దలు సరైన అలవాట్ల తో వుండాలి. ముందుగా ఇన్ స్టెంట్ స్నాక్స్ స్ధానంలో ఇంట్లో ఉడికించిన వేరు సెనగలు, మొక్క జొన్నలు, సలాడ్లు, పండ్లు వంటివి అందరికి ఆహారంగా వుండాలి. స్టాక్ లేదా బేకరీ బ్రేడ్స్, బిస్కెట్లు, కుకీలు కుక్ స్ధానంలో ఇంతో తయ్యారు చేసుకున్న ఆర్గానిక్ హోల్ గ్రెయిన్ ఫ్లోర్, బెల్లం, తేనె, బ్రౌన్ షుగర్, తీపి లేని కోకో పౌడర్ మొదలైనవి వాదికోవాలి. ప్రోసెస్డ్ జామ్ లు, సాస్ ల స్ధానంలోకి ఇంట్లో చేసిన ఆరోగ్యవంతమైన చట్నీలుండాలి. కుకీలు, కాండీలు, చాక్లెట్లు బదులు పండ్లు, డ్రై ఫ్రూట్స్ తినాలి. సరైన ఆహారపు అలవాట్లు చినప్పటి నుంచి చేస్తే ఎదిగిన కొద్దీ వారిలో వారికే ఒక నియంత్రణ ఏర్పడి బయటి ఆహ్రానికి ఎట్రాక్ట్ కాకుండా ఉంటారు.

Leave a comment